Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (10:28 IST)
మెగాస్టార్ చిరంజీవి సరసన యువ హీరోయిన్ అదితి రావు హైదరీ నటించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పూర్తి హాస్యభరిత సినిమాగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర నిర్మాణ జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేక ఏమిటంటే... చాలా యేళ్ల తర్వాత పల్లెటూరి అందాల నడుమ ఈ చిత్ర నిర్మాణం చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి సీజన్‌కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో వినోదానికి ఏ మాత్రం కొదవ ఉండబోదని ఇప్పటికే నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం హీరోయిన్‌గా అదితి రావు హైదరీ నటించనున్నారని వార్తలు వినిబడుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిన కాంబో అయిన సంగీత దర్శకులు భీమ్, రమణ గోకుల ఈ మూవీకి పని చేయనున్నారని అంటున్నారు. 
 
ఇటీవలే నిర్మాణ సంస్థ సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్టునకు పూజలు చేయించారు. ఇప్పటివరకు రంగు రంగులూ సెట్టింగ్‌లు, హైటెక్‌ హంగులతో చిత్ర నిర్మాణాలు స్టూడియోలలో చేయగా, ఇపుడు గతంలో మాదిరి పల్లెటూరి అందాల నడుమ చిత్ర నిర్మాణం చేయనున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి గతంలో విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో ఊరికి ఇచ్చిన మాట, 'పల్లెటూరి మోసగాడు', 'శివుడు', 'శివుడు శివుడు', 'ఖైదీ', 'అల్లుడా మజాకా', 'ఆపద్భాంధవుడు', 'ఇంద్ర', 'సింహపురి సింహం' వంటి మూవీలు చేశారు. ఈ సినిమాలు చిరు అభిమానులను విశేషంగా అలరించాయి. ఈ మూవీలు కేవలం వినోదమేకాకుండా పల్లెటూరి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని చక్కగా ఆవిష్కరించి ఆకట్టుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments