Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదిమందికి ఉపాధి కల్పించాలనే క సినిమా తీశా : చింతా గోపాలకృష్ణ రెడ్డి

డీవీ
మంగళవారం, 29 అక్టోబరు 2024 (17:20 IST)
Chinta Gopalakrishna Reddy
ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ గారితో యశోద చిత్రం, తర్వాత సారంగపాణి జాతకం అనే మూవీ కూడా కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను. ఆయన మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం సోలో నిర్మాతగా పదిమందికి పనికల్పించి మంచి సినిమాలు తీయాలని కిరణ్ అబ్బవరపుతో క అనే సినిమా చేశాను అని నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి అన్నారు.
 
నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించిన క సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగగా విడుదల కాబోతుంది. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో "క" సినిమా ప్రొడ్యూస్ చేసిన ఎక్సిపీరియన్స్ తెలిపారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి.
 
- మాది రాజమండ్రి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. లాక్ డౌన్ టైమ్ లో "ఇప్పుడు కాక ఇంకెప్పుడు" అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను.  కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఆ మూవీ చేశాను. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. 
 
నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పైగా ముందు చిన్న సినిమా నిర్మిస్తే ఈ రంగంలో అనుభవం తెచ్చుకోవచ్చు. మంచి సినిమా చేశామనే గుర్తింపు వస్తే చాలు. నా సినిమా కోట్ల మంది చూశారనే సంతృప్తి ఎంతో విలువైనదిగా భావిస్తా.  ఆ సినిమా తర్వాత సమంత నటించిన యశోద సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాను. ఆ సినిమాతో ఇండస్ట్రీలో కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్నా. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో వచ్చాను కాబట్టి నిర్మాతగా నాకు నష్టం జరగదు అని భావిస్తాను. నా వ్యాపారాలు నేను చేసుకుంటూనే మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నాను.
 
- హీరో కిరణ్ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. "క" సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్ తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది. నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికే వాళ్లు ఈ సినిమాలో రాము అనే కుక్కపిల్లకు ట్రెయినింగ్ ఇస్తున్నారు. అంతగా డైరెక్టర్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు క సినిమా రిలీజ్ కు ముందే మా కాస్ట్ అండ్ క్రూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్లకు అవకాశాలు వస్తున్నాయంటే నాకు సంతోషమే. వాళ్లను ఫస్ట్ మెట్టు ఎక్కించేది నేనే కావాలని కోరిక.
 
- హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. "క" సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మల్లీ ఉదయమే 5 గంటలకు సెట్ కు వచ్చేవాడు. షూటింగ్ చేస్తున్న స్టూడియో వాళ్లు కూడా మీ టీమ్ తక్కువ టైమ్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని అనేవారు. మా డైరెక్టర్స్ కూడా తాము అనుకున్నది వచ్చేదాకా రాజీపడేవారు కాదు ప్రతి షాట్ రిచ్ గా ఉండాలని ప్రయత్నించారు. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా చిన్న చిన్న షాట్స్ షూట్ చేసి యాడ్ చేశారు. అలా చివరి నిమిషం వరకు ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా కిరణ్ తో గతంలో వర్క్ చేసినవాళ్లే. కాబట్టి వాళ్లంతా ఒక టీమ్ వర్క్ లాగా కలిసి పనిచేశారు. దాంతో నిర్మాతగా నాకు టెన్షన్ తగ్గిపోయింది.
 
- "క" సినిమా కథ మా డైరెక్టర్స్ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారు. నేను ఔట్ పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. కథను వాళ్లు మలుపుతిప్పిన విధానం చూసి వీళ్లు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. క సినిమాకు సీక్వెల్ కూడా చేసుకోవచ్చు. మా సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రెండ్ అయ్యాయి. ఇవాళ మా మూవీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటారంటే ప్రొడ్యూసర్ గా సంతోషమే. టీజర్ రిలీజ్ అయిన వెంటనే బిజినెస్ కోసం కాల్స్ వచ్చాయి. వంశీ నందిపాటి గారిని కిరణ్ సజెస్ట్ చేశాడు. ఆయన ఏపీ, తెలంగాణ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో చాలా మంచి థియేటర్స్ లభించాయి. 350కి పైగా థియేటర్స్ లో క రిలీజ్ అవుతోంది.
 
- పాన్ ఇండియా రిలీజ్ కావడం లేదనే బాధ లేదు. కాంతార సినిమా కన్నడలో హిట్ అయ్యాక తెలుగులోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా క సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంటే మిగతా భాషల్లో క్రేజ్ ఏర్పడుతుంది. మా టీమ్ అంతా క సినిమా కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నాం. క సినిమాకు మొదట ఇచ్చోటనే అనే టైటిల్ అనుకున్నాం. అలాగే సినిమా మొదలుపెట్టాం. క టైటిల్ చెప్పినప్పుడు బాగుందని అనిపించింది. క పేరు మీద హిట్ సినిమాలు వచ్చాయి. సినిమాలో టైటిల్ ఎందుకు క అని పెట్టారో జస్టిఫికేషన్ ఇచ్చారు మా డైరెక్టర్స్. ఒక మంచి సినిమా చేయాలని హీరోతో పాటు యూనిట్ అంతా తపించింది.
 
- ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ గారికి నాలాగే సినిమా అంటే ప్యాషన్. ఇప్పుడు ఆయనతో యశోద తర్వాత సారంగపాణి జాతకం అనే మూవీ కూడా కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను. ఆయన గోపి గారు మనం ట్రావెల్ చేద్దాం అన్నారు. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. నేను కూడా సరేనన్నాను. ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ జనవరిలో ఫైనల్ చేస్తాను. ఏ ఫీల్డ్ లో లేని కష్టం చిత్ర పరిశ్రమలో ఉంది. అలాగే ఏ రంగంలో లేని గుర్తింపు, ఫేమ్ సినీ రంగంలో ఉంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే అది మంచి సినిమానే అయి ఉంటుందనే పేరు తెచ్చుకోవాలనేదే నిర్మాతగా నా లక్ష్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments