Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో 'చిన్నారి' విడుద‌ల‌

ప్ర‌ముఖ సౌత్ ఇండియ‌న్ స్టార్ ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం `చిన్నారి`. బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని కె.ఆర్‌.కె. ప్రొడ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (16:43 IST)
ప్ర‌ముఖ సౌత్ ఇండియ‌న్ స్టార్ ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం `చిన్నారి`. బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని కె.ఆర్‌.కె. ప్రొడ‌క్ష‌న్స్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె. ర‌వికుమార్‌, ఎం.ఎం.ఆర్ నిర్మాత‌లు. తెలుగు, క‌న్న‌డ‌లో ఏక‌కాలంలో రూపొందిస్తున్నారు. లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 
ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ... నాకు ద‌ర్శ‌కుడిగా తొలి చిత్ర‌మిది. హార‌ర్ జోన‌ర్‌లో చాలా డిఫ‌రెంట్‌గా ట్రై చేశాం. త‌ల్లీకూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్త‌యింది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌ గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా ఉంద‌ని చాలా మంది చెబుతున్నారు. వేణు కెమెరా ప‌నిత‌నం, ర‌విచంద్ర‌కుమార్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. అజినీష్ లోక్‌నాథ్ మంచి సంగీతం చేశారని చెప్పారు. 
 
నిర్మాత‌లు మాట్లాడుతూ... హార‌ర్ చిత్ర‌మిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. గోవా నేప‌థ్యంలో క‌థ జ‌రుగుతుంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. `రంగి త‌రంగి`కి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చ‌క్క‌టి బాణీల‌ను ఇచ్చారు. క‌న్న‌డ‌లో టాప్‌ కెమెరామెన్ వేణు ఫోటోగ్ర‌ఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌, ఆర్.ఆర్ మెప్పిస్తాయి. ఈ నెల 25న సినిమాను విడుద‌ల చేస్తామని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments