Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మపుత్ర నదీజలాల సమాచారాన్ని పంచుకునేందుకు సై..

బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు చైనా సిద్ధమైంది. టిబెట్‌లో డేటా కలెక్షన్ స్టేషన్ అప్‌గ్రేడేషన్ పేరుతో భారత్‌తో ఆ డేటాను పంచుకోలేమంటూ గతేడాది చైనా తేల్చి చెప్పింది. అయితే

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (11:25 IST)
బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు చైనా సిద్ధమైంది. టిబెట్‌లో డేటా కలెక్షన్ స్టేషన్ అప్‌గ్రేడేషన్ పేరుతో భారత్‌తో ఆ డేటాను పంచుకోలేమంటూ గతేడాది చైనా తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు జరిపిన చర్చలు ఫలించడంతో బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు సై అంటూ చైనా ప్రకటించింది.
 
వరదలను అంచనా వేసేందుకు అత్యంత అవసరమైన ఈ డేటాను పంచుకోవడాన్ని చైనా ఆపివేయడంతో అప్పట్లో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ఈ సమాచారాన్ని భారత్ పంచుకునేందుకు నిర్ణయించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ చెప్పారు. 
 
కాగా డోక్లామ్ ప్రాంతం గురించి భారత్- చైనాల మధ్య గతేడాది 73 రోజుల పాటు ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో బ్రహ్మపుత్ర నదీ జలాల సమాచారాన్ని ఇచ్చేందుకు డ్రాగన్ నిరాకరించింది. అయితే, చైనాలోని హాంగ్‌ఝౌ నగరంలో భారత్-చైనా ఉన్నతస్థాయి అధికారులు జరిపిన చర్చలు సఫలమవడంతో.. నదీ జలాల సమాచారాన్ని పంచుకోనున్నట్టు చైనా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments