Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ రోజైతే చూశానో నిన్ను చిత్రంతో నాయికగా బాలనటి ఐశ్వర్య గౌడ

డీవీ
గురువారం, 5 డిశెంబరు 2024 (17:53 IST)
Aishwarya Gowda
మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ  మరియు రాస్ర ఎంటర్ టైన్మంట్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'ఏ రోజైతే చూశానో నిన్ను'. ఈ చిత్రం ద్వారా ఇద్దరు బాల నటులు నూతన నాయకానాయికలు పరిచయమవుతుండటం విశేషం.
 
స్క్రీన్ ప్లే మరియు విజువల్ ఎఫెక్ట్స్ లో సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించి మెప్పించిన భరత్ రామ్ హీరోగా పరిచయమవుతున్నాడు. అలాగే ఈ చిత్రం ద్వారా ఒక యువ ప్రతిభావంతురాలను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.
 
చార్లీ 777, జాగ్వార్ లాంటి పలు కన్నడ చిత్రాల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య గౌడ 'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 
 
ఈ డిసెంబర్ నెలలోనే 'ఏ రోజైతే చూశానో నిన్ను' షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ రామ్, ఐశ్వర్య గౌడ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments