Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సంక్రమించి 'చిచ్చోర్' నటి కన్నుమూత!!

Webdunia
గురువారం, 6 మే 2021 (14:06 IST)
కరోనా వైరస్ మరో బాలివుడ్ నటిని చంపేసింది. ఆమె పేరు అభిలాషా పాటిల్. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఈమె.. క‌రోనా వైర‌స్‌కు గురై చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. గ‌త మూడు రోజులుగా క‌రోనాకు చికిత్స తీసుకుంటున్న అభిలాష.. ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 
 
స్వ‌ర్గీయ‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోర్’ చిత్రంతో అభిలాషా పాటిల్ మంచి పేరు సంపాదించారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. మరాఠీ సీరియల్ ‘బాప్ మనుస్’తో పాటు ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించి మ‌రాఠీల అభిమాన తార‌గా వెలుగొందిన‌ అభిలాష మ‌ర‌ణాన‌ని ఆమెతో క‌లిసిన న‌టించిన‌ నటుడు సంజయ్ కులకర్ణి ధ్రువీకరించారు.
 
ప్ర‌స్తుతం బెనారస్‌లో ఉన్న అభిలాషా నాలుగైదు రోజులుగా క‌రోనా వైర‌స్ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ది. దాంతో ఆమెను మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆమె కుటుంబ‌స‌భ్యులు ముంబైకి తీసుకొచ్చారు. అక్క‌డ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శ్వాస‌తీసుకోవ‌డంలో చాలా ఇబ్బందిగా రెండు రోజులు గ‌డిపి చివ‌ర‌కు బుధ‌వారం రాత్రి క‌న్నుమూసింది.
 
కాగా, న‌టి అభిలాషా పాటిల్ మృతిప‌ట్ల ప‌లువురు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. బాలీవుడ్‌లో సాధించేది ఎంతో ఉన్న అభిలాష ఇలా అక‌స్మాత్తుగా అంద‌రినీ వీడిపోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని న‌టుడు సంజ‌య్‌ కులకర్ణి విచారం వ్య‌క్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments