వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఛత్రపతి హిందీ రీమేక్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది. ఈ రోజు దర్శకుడు వి.వి. వినాయక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బీఎస్ఎస్9 సెట్లో వి వి వినాయక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై వి.వి వినాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినాయక్ తెలుపుతూ, రాజమౌళి తీసిన ఛత్రపతి సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుని హిందీలో నిర్మిస్తున్నాను. కొన్ని మార్పులతో హిందీ నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కిస్తున్నామనీ, త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.