Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీఎస్ చెల్లించని హీరో విశాల్.. నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (10:54 IST)
ప్రముఖ తమిళ నటుడు విశాల్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. టీడీఎస్ చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్)ను సక్రమంగా చెల్లించని కేసులో ఈ వారెంట్ జారీ అయింది. 
 
టీడీఎస్ సక్రమంగా చెల్లించకపోవడంతో గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు విశాల్‌కు నోటీసులు పంపారు. ఆ నోటీసులపై విశాల్ స్పందించకపోవడంతో  ఎగ్మూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆగస్టు 2న విచారణకు నేరుగా హాజరు కావాలంటూ విశాల్‌ను ఆదేశించింది.
 
అయినప్పటికీ విశాల్ శుక్రవారం కోర్టుకు హాజరుకాలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించింది. అయితే, కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న విశాల్ తరపు న్యాయవాదుల అభ్యర్థనను ఐటీ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. వాదనల అనంతరం విశాల్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments