Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మోసగాడా...? కోర్టుకు హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు సమన్లు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (18:48 IST)
కొన్ని డీలింగ్స్‌లో మంచితనానికి పోతే ఏవేవో చిక్కులు వచ్చిపడతాయి. ఆ డీలింగ్‌లో తప్పెవరదన్నది తెలుసుకోవడం కూడా కష్టమే. ఆ సంగతి అలా వుంచితే బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్ రాజమౌళి మోసగాడంటూ భువనేశ్వర్ అనే సినీ దర్శకుడు రాజమౌళిపై ఫిర్యాదు చేశారు. 
 
ఇంతకీ ఆయన చేసిన మోసం ఏంటంటే... హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని ఫొటోగ్రాఫర్స్ కాలనీలో ఫ్లాట్‌ను తనకు విక్రయిస్తానని చెప్పి ఎగ్రిమెంట్ చేసుకొని తరువాత మరొకరికి అమ్మారట రాజమౌళి. ఈ కేసు కూడా 2012 నాటిది. అప్పట్లో పోలీసులు రాజమౌళిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. 
 
ఐతే ఈ విచారణకు రాజమౌళి హాజరు కావడంలేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు ఈ నెల 24న వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీనిపై ఎలా ముందుకు పోవాలన్న దానిపై రాజమౌళి న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments