Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధుమీనన్‌తో పాటు సోదరుడిపై కేసు.. రుణం తీసుకుని చెల్లించకపోవడంతో?

చందమామ నటి సింధుమీనన్‌పై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ బ్యాంకును మోసం చేసిందని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లీజుకు తీసుకున్న భవనాన్ని తాకట్టు పెట్టే యత్నంలో నకిలీ పత్రాలను సింధు సృష్టించినట్

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (10:53 IST)
చందమామ నటి సింధుమీనన్‌పై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ బ్యాంకును మోసం చేసిందని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లీజుకు తీసుకున్న భవనాన్ని తాకట్టు పెట్టే యత్నంలో నకిలీ పత్రాలను సింధు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు సింధు మీనన్‌తో పాటు ఆమె సోదరుడు మనోజ్ కార్తీపైన కూడా కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే, మనోజ్ కార్తీ, సింధు, మరో ఇద్దరు కలిసి గణేశ్ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ భవనాన్ని తమదిగా చూపి బ్యాంకు రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి.. చిక్కుకున్నారు.  ఈ విషయాన్ని గుర్తించిన యజమాని పోలీసులను ఆశ్రయించడంతో సింధుమీనన్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె సోదరుడిపై కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ నకిలీ పత్రంలో సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ బెంగళూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇందుకు సింధు మూడో గ్యారంటర్‌గా ఉంది. తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేశారని బ్యాంకు అధికారులు ఆమెపైనా, ఆమె సోదరులపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments