Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో చిక్కుకున్న నయనతార -విఘ్నేశ్ దంపతులు

Webdunia
శనివారం, 8 జులై 2023 (12:07 IST)
స్టార్ కపుల్ నయనతార -విఘ్నేశ్ శివన్ దంపతులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి పోలీసులు ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్ బాబాయిలు నయనతార పేరును కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే, విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు స్వస్థలం తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని లాల్‌కుడి గ్రామం. ఆయనకు ఎనిమిది మంది అన్నదమ్ముులు ఉన్నారు. 
 
శివ కొళుదు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పని చేసేవారట. శివ కొళుదు అమ్ముకున్న ఆస్తి విషయమై తాజాగా ఆయన సోదరులు మాణిక్యం, కుంచిత పాదం పోలీసులను ఆశ్రయించారు. 
 
తమకు తెలియకుండా శివ అమ్ముకున్న ఆస్తిని కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి తిరిగి తెచ్చుకునేందుకు సాయపడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డీజీపీ ఆఫీసులో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేశారు.
 
తమ ఫిర్యాదులో విఘ్నేశ్ శివన్, ఆయన భార్య నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments