Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుజారి కిందపడిన ఛార్మి.. 'థ్యాంక్స్ అమైరా దస్తూర్ ఫర్ దిస్ బ్యూటీఫుల్ గిఫ్ట్' అంటూ ట్వీట్!

పంజాబీ బ్యూటీ, బాపుబొమ్మ ఛార్మి కాలుజారింది. కుర్చీలో కూర్చోబోయి అదుపుతప్పి కింద పడింది. దీంతో కాలికి చిన్న ఫ్రాక్చర్ అయిందట. డాక్టర్ దగ్గరకు వెళితే మోకాలి నుండి కింద వరకు పెద్ద కట్టుకట్టారట. దీనిపై ఛ

Webdunia
సోమవారం, 11 జులై 2016 (12:55 IST)
పంజాబీ బ్యూటీ, బాపుబొమ్మ ఛార్మి కాలుజారింది. కుర్చీలో కూర్చోబోయి అదుపుతప్పి కింద పడింది. దీంతో కాలికి చిన్న ఫ్రాక్చర్ అయిందట. డాక్టర్ దగ్గరకు వెళితే మోకాలి నుండి కింద వరకు పెద్ద కట్టుకట్టారట. దీనిపై ఛార్మి ఓ ట్వీట్ చేసింది. ''థ్యాంక్స్ అమైరా దస్తూర్ ఫర్ దిస్ బ్యూటీఫుల్ గిఫ్ట్'' అంటూ పేర్కొంది. 
 
అంతేకాదు ''యూ రియల్లీ బ్రోక్ ఏ లెగ్'' అంటూ తన కాలి ఫోటోని కూడా తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇంతకీ లెగ్‌కి ట్వీట్‌కి సంబంధమేంటని తలపట్టుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. ముంబై నుంచి వచ్చిన స్నేహితురాలు అమైరాకి హైదరాబాద్ సిటీ అంతా తిప్పి చూపించిందట ఛార్మి. ఆ తర్వాత ఇద్దరూ రూంకి తిరిగి వచ్చారు. 
 
కుర్చీలో కూర్చునే సమయంలో ఛార్మీ స్లిప్ అయి కిందకు పడబోయింది. పడిపోతున్న ఛార్మీని పట్టుకున్న అమైరా బ్యాలెన్స్ తప్పిపోవడంతో ఇద్దరూ కింద పడ్డారు. కాలికి కాస్త దెబ్బ తగిలినట్లు అనిపించి ఛార్మీ మూవ్ రాసి పడుకుందట. పొద్దున లేచి చూసేసరికి ఛార్మీ కాలు వాసిపోయిందట. డాక్టర్‌ని సంప్రదిస్తే కాలుకి కట్టు కట్టి పంపించారట. అనంతరం అమైరా ముంబైకి వెళ్ళిపోవడంతో, వెళ్ళే ముందు మంచి గిఫ్ట్ ఇచ్చావ్ అని ఛార్మి సరదాగా ట్వీట్ చేసిందట. ఇదండీ సంగతి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

టెక్నాలజీ వాడకంలో బాబును మించినోడు లేరు... ఏఐతో ప్రెస్మీట్ లైవ్!!

ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం : గవర్నర్ అబ్దుల్ నజీర్

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

హస్తిలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments