Webdunia - Bharat's app for daily news and videos

Install App

భజరంగీ భాయ్ జాన్‌తో హిట్టైన పాక్ జర్నలిస్ట్ చాందీ నవాబ్.. డబ్బులిస్తే..?

Webdunia
బుధవారం, 29 జులై 2015 (17:02 IST)
భజరంగీ భాయ్ జాన్‌తో పాకిస్థాన్ జర్నలిస్ట్ చాందీ నవాబ్ హిట్టయ్యాడు. నిన్నటి వరకు పాకిస్థాన్‌లో సాధారణ జర్నలిస్టుగా జీవితం గడిపిన వ్యక్తిని భారతీయ సినిమా సెలబ్రిటీగా మార్చేసింది. సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'భజరంగీ భాయ్ జాన్'లో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన పాత్ర 'చాంద్ నవాబ్'కు పాకిస్థాన్ జర్నలిస్ట్ చాంద్ నవాబ్ స్ఫూర్తి. పాకిస్థాన్‌లోని కరాచీ రైల్వే స్టేషన్‌లో వార్తలు సేకరించి ఇచ్చేవాడు.
 
చాంద్ నవాబ్ 'పీ టూ సీ' చెబుతుండగా చాలామంది కెమెరాలో కనబడాలని అడ్డం వచ్చేవారు. అలాంటప్పుడు ఆయన వారిపై విరుచుకుపడేవాడు. ఇంకొందరికి సర్ది చెప్పేవాడు. మరి కొందర్ని అదిలించేవాడు. దీనిని అతని స్నేహితులు వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో 2008 డిసెంబర్ 8న అప్ లోడ్ చేశారు.
 
ఆ వీడియోకి మంచి ఆదరణ లభించింది, చాలా మందికి నవ్వులు పంచింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న కబీర్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్'లో చాంద్ నవాబ్ పాత్రను పెట్టారు. ఈ పాత్ర పాకిస్థాన్‌లో చాంద్ నవాబ్‌కు విపరీతమైన పేరుప్రతిష్ఠలు తీసుకొచ్చింది. ఇప్పుడు చాంద్ నవాబ్ అక్కడ సెలబ్రిటీగా మారాడు. 
 
ఇంకా ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు, ఫోటోలు దిగేందుకు, ఇంటర్వ్యూ తీసుకునేందుకు ఎగబడుతున్నారు. దీంతో తనను సెలబ్రిటీని చేసిన సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్‌కు చాంద్ నవాబ్ ధన్యవాదాలు తెలిపాడు. వారిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారని, వారిని కలిసినప్పుడు తనకు కొంత డబ్బులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు. మరి సల్మాన్ ఖాన్ ఏం చేస్తారో.. వెయిట్ చేసి చూడాల్సిందే..!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments