టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు గాయపడ్డాడు. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతూ జారి కిందపడ్డాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆయనను ఆపోలో ఆస్పత్రికి తరలించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు గాయపడ్డాడు. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతూ జారి కిందపడ్డాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆయనను ఆపోలో ఆస్పత్రికి తరలించారు. హీరో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం షూటింగ్ సమయంలో ఆయనకు ఈ ప్రమాదం జరిగింది.
చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత, డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై హీరో నరేష్ వాకబు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.