Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ కమెడియన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (13:37 IST)
బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్, సినీ నటుడు చలాకీ చంటి ఆదివారం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. గుండెనొప్పితో బాధపడుతున్న చలాకీ చంటి... శనివారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారనే ప్రచారం సాగింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్యంపై వైద్యులు లేదా ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
కాగా, జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయమైన చలాకీ చంటి పలు సినిమాల్లోనూ నటించారు. సినిమా షూటింగులు కోసం జబర్దస్త్ షోను విడిచిపెట్టారు. అయితే, అపుడపుడూ షోలో సందడి చేసేవారు. ఆ తర్వాత "నా షో నా ఇష్టం" కార్యక్రమానికి యాంకర్‌గా చంటి వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్‌ 6లో పాల్గొన్నారు. చివరి వరకు పోటీలో ఉండలేక మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. కొంతకాలంగా ఇటు బుల్లితెరపై కానీ ఇటు వెండితెరపైకానీ చంటి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో శనివారం చంటి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments