Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు జొన్నలగడ్డ, రవి ఆంథోని కొత్త చిత్రం ధార్కారి #MM పార్ట్ 2

డీవీ
మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:12 IST)
Dharkari #MM Part 2 poster
కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ముందుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ క్రేజీ చిత్రానికి సంబంధించి ఇచ్చిన అప్డేట్‌ అందరినీ ఆకట్టుకుంది.
 
టిల్లు స్క్వేర్ సినిమాకు రైటర్‌గా, మ్యాడ్ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించి మెప్పించిన రవి ఆంథోని ఇప్పుడు డైరెక్టర్‌గా మారారు. దర్శకుడిగా రవి ఆంథోని కొత్త చిత్రానికి సంబంధించిన ఈ అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ నటుడిగా అందరినీ ఆకట్టుకున్నారు. బబుల్ గమ్ సినిమాలో అద్భుతమైన నటనతో చైతు జొన్నలగడ్డ అందరినీ మెప్పించారు. ఇక తమ్ముడు సిద్దు బాటలోనే చైతు నడుస్తున్నారు. ఇప్పుడు చైతు జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే, మాటల్ని కూడా అందిస్తున్నారు. రవి ఆంథోని దర్శకత్వం.. చైతు జొన్నలగడ్డ రైటింగ్‌తో.. ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో రాబోతోన్న ‘ధార్కారి #MM పార్ట్ 2’ అనే చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ మసాలా చిత్రమంటూ వదిలిన ప్రీ లుక్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరో ఎవరు? అనేది రివీల్ చేయకుండా.. డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ మెప్పిస్తోంది.. అందులో హీరో గోల్డ్ మెన్‌గా ఫుల్ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘ధార్కారి #MM పార్ట్ 2’ అంటూ ఈ పోస్టర్ మీద కనిపిస్తుండటం.. అసలు పార్ట్ వన్ అనేది లేకుండా.. ఇలా రెండో పార్ట్‌ను ప్రకటించడంతొ.. అందరిలోనూ ఆసక్తిని పెంచేసినట్టు అయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లకు బిగిస్తే కఠిన చర్యలు : వైజాగ్ కమిషనర్

మీ మధ్యలో ఓ మహిళా జర్నలిస్టు నలిగిపోతుంటే.. గమనించారా? జర్నలిస్టులకు పవన్ ప్రశ్న

దీపావళి వేడుకల్లో మాంసాహార విందు.. నివ్వెరపోయిన హిందువులు

నీట్ శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల లైంగికదాడి...

2025 సంవత్సరానికిగాను సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments