అక్కినేని నాగచైతన్య- సమంతల వివాహం అట్టహాసంగా జరిగింది. సమంతకు ట్విట్టర్ ద్వారా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ సమంత ధన్యవాదాలు
అక్కినేని నాగచైతన్య- సమంతల వివాహం అట్టహాసంగా జరిగింది. సమంతకు ట్విట్టర్ ద్వారా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ సమంత ధన్యవాదాలు తెలియజేస్తోంది.
ఇప్పటి వరకు మహేశ్ బాబు, రాజ్ తరుణ్, దర్శకుడు హరీష్ శంకర్, నాని, మంచు మనోజ్, కోన వెంకట్, నటీమణులు త్రిష, శ్రుతి హాసన్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. మంత్రి కేటీఆర్ కూడా సమంతకు విషెస్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ సమంత ఎప్పటికప్పుడు ఫొటోలు పెడుతూనే పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే.. గోవాలోని వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ హోటల్‌లో పూర్తి తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం పచ్చని తోరణాలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఆత్మీయుల మధ్య సమంత, నాగచైతన్యల వివాహం జరిగింది.
అయితే హిందువైన నాగచైతన్య, క్రైస్తవ యువతైన సమంతను వివాహం చేసుకోనుండడంతో ఆమె భావాలకు కూడా విలువనిస్తూ శనివారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్నాడు. ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహంలో క్రేసా వెడ్డింగ్ గౌన్‌ను సమంత ధరించనున్నట్టు తెలుస్తోంది.