Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంటు, షర్టు వేసుకుని వుంది... ఆమె ఆడది ఎలా అవుతుంది? మహిళా నిర్మాతకు చేదు అనుభవం

ఓ మహిళా సినీ నిర్మాతకు సెన్సార్ సభ్యుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఈ చేదు అనుభవానికి కారణం ఆమె తీసిన సినిమానే. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి హీరోగా నటించిన ‘బాబూ మోషాయ్.. బందూక్ బాజ్’ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. ఈ చిత్రం సెన

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (14:17 IST)
ఓ మహిళా సినీ నిర్మాతకు సెన్సార్ సభ్యుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఈ చేదు అనుభవానికి కారణం ఆమె తీసిన సినిమానే. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి హీరోగా నటించిన ‘బాబూ మోషాయ్.. బందూక్ బాజ్’ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. ఈ చిత్రం సెన్సార్ కోసం వెళ్లగా, అందులో సీన్లు చూసి సెన్సార్ సభ్యులు షాక్ తిన్నారట. 
 
అంతా బూతులు, ద్వంద్వార్థాలు, అభ్యంతరకర సన్నివేశాలతో ఆ సినిమా చూసేందుకే బీభత్సంగా వుందట. దీనితో వరుసబెట్టి 48 కత్తెర్లు వేసేశారట. అంతేకాదు... ఆ కత్తెర్లు వేసిన తర్వాత కూడా సినిమాలో బూతు వాసన పోలేదని సమాచారం. దీనితో మళ్లీ ఆ చిత్రంపై సమావేశమైన సెన్సార్ సభ్యులు... అక్కడే ఆ చిత్రాన్ని తీసిన మహిళా నిర్మాత వుండటాన్ని గమనించారట. 
 
సదరు మహిళా నిర్మాత కిరణ్ ష్రాఫ్‌ను సెన్సార్ బోర్డులో వున్న ఓ మహిళా అధికారి పిలిచి... ఏవమ్మా మీరూ మహిళే కదా... ఈ చిత్రంలో మహిళను ఇంత అసభ్యంగా ఎలా చూపించారంటూ ప్రశ్నించిందట. ఆమె మాటను అందుకున్న మరో అధికారి... ఆమె మహిళ ఎలా అవుతుంది. ప్యాంటు, షర్టు వేసుకుని వున్నారు కదా అంటూ హేళన చేశారట. ఈ విషయాలన్నిటినీ సదరు మహిళా నిర్మాత మీడియాకు వివరించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments