Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో తగ్గుతున్న సినిమా ఛాన్సులు.. రకుల్ ప్రీత్ సింగ్ ముందు చూపు అదుర్స్

సినిమాలలో హీరోయిన్‌ల పాత్ర నిడివి రోజురోజుకీ తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు నటనకు ఆస్కారం ఉండే పాత్రలతో పాత తరం నటీమణులు అద్దరగొట్టిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఇప్పటి సినిమాలలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (13:02 IST)
సినిమాలలో హీరోయిన్‌ల పాత్ర నిడివి రోజురోజుకీ తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు నటనకు ఆస్కారం ఉండే పాత్రలతో పాత తరం నటీమణులు అద్దరగొట్టిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఇప్పటి సినిమాలలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాదు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా ఇంకా ఎక్కువ సినిమాలకు సైన్ చేసేస్తున్నారు. ఒక్క హిట్ పడితే చాలు ఓవర్‍‌నైట్ స్టార్ హీరోయిన్ అయిపోతున్నారు. 
 
అలా వచ్చిన హీరోయిన్ మన 'రకుల్ ప్రీత్ సింగ్'. 2013వ సంవత్సరంలో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో హిట్ అందుకున్న రకుల్ ఆ తర్వాత 'లౌక్యం', 'కరెంట్ తీగ', 'పండగ చేస్కో', 'కిక్-2', 'బ్రూస్‌లీ', 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు', 'ధృవ', 'విన్నర్', 'స్పైడర్' మొదలైన సినిమాలతో తానూ టాప్ హీరోయిన్ అనిపించుకుంది. చేతిలో సినిమాలు తగ్గుతున్నాయని ముందుచూపుతో ఆలోచించి, 2016వ సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఒక అధునాతనమైన జిమ్‌ను 'F45' పేరిట ప్రారంభించింది. 
 
అది కాస్త మంచి లాభాలు తెచ్చిపెట్టే సరికి, శాఖలను విస్తరించే కోణంలో 'వైజాగ్‌'లో ఏర్పాటు చేసింది, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా మరో శాఖను త్వరలో ప్రారంభించనుంది. ప్రస్తుతం హీరో 'కార్తీ' సరసన 'ఖాకీ' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ ఒక్క చిత్రం మినహా చేతిలో వేరే సినిమా ఏమీ లేదు. ఇలా హీరోయిన్‌ రకుల్ తన లౌక్యంతో ముందుగానే జీవితాన్ని గురించి ఆలోచించి మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతూ వేరే హీరోయిన్‌లకు ఆదర్శంగా నిలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments