Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య మృతిప‌ట్ల ప్ర‌ముఖుల సంతాపం

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (12:28 IST)
Senior actor balayya
ప్రముఖ నటులు శ్రీ బాలయ్య గారు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు.
నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు.
నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయ‌న మృతిప‌ట్ల ప‌లువురు సంతాపాన్ని తెలియ‌జేశారు. ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వెంక‌టేష్‌, డిసురేష్‌బాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్ వంటివారు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.
 
బాల‌కృష్ణ సంతాపం
సీనియ‌ర్ న‌టులు మ‌న్న‌వ బాల‌య్య‌గారి మ‌ర‌ణ‌వార్త న‌న్నెంత‌గానో బాధించింది. బాల‌య్య‌గారు అద్భుత‌మైన న‌టులు. నాన్న‌గారితో క‌లిసి న‌టించారు. నా చిత్రాల్లోకూడా మంచి పాత్ర‌లు పోషించారు. న‌టుడిగానే కాకుండా ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా త‌న ప్ర‌తిభ‌ను చూపారు. ఆయ‌న‌తో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈరోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఆయ‌న విత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.
 
నాదెండ్ల మనోహర్ సంతాపం
శ్రీ బాలయ్య మృతికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సంతాపం తెలిపారు. శ్రీ బాలయ్య గారు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 
 
కుమారుడు తులసీరామ్ కూడా న‌టుడే
ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము - శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో)  లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు.
దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు.
ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు.
శ్రీ బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments