Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ 150 ఐటమ్ సాంగ్ నుంచి రిలీఫ్: రానాతో రొమాన్స్‌కు కేథిరిన్ రెడీ

బాహుబలి భల్లాలదేవ రానాతో రొమాన్స్ పండించేందుకు కేథరిన్ రెడీ అవుతోంది. మెగాస్టార్ 150వ సినిమా ఐటెం సాంగ్ వివాదం నుంచి కోలుకున్న కేథరిన్.. రానాతో నటించేందుకు రెడీ అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ స

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (14:14 IST)
బాహుబలి భల్లాలదేవ రానాతో రొమాన్స్ పండించేందుకు కేథరిన్ రెడీ అవుతోంది. మెగాస్టార్ 150వ సినిమా ఐటెం సాంగ్ వివాదం నుంచి కోలుకున్న కేథరిన్.. రానాతో నటించేందుకు రెడీ అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ తన హవాను కొనసాగిస్తున్న కేథరిన్.. రానా హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నానే రాజా నానే మంత్రి సినిమాలో కనిపించనుంది. 
 
టాలీవుడ్ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానాతో ఇప్పటికే నటి కాజల్‌ అగర్వాల్ డ్యూయెట్లు పాడుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాలోనే మరో టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే శ్రుతిహాసన్‌కు డేట్స్ కుదరకపోవడంతో ఆమె స్థానంలో కేథరిన్‌ను తీసుకున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. 
 
కేథరిన్‌కు పోటీగా ఈ రోల్ ఉంటుందని, రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ కారైక్కుడి, కేరళ ప్రాంతాల్లో జరుపుకుంది. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్‌లో కేథరిన్ పాల్గొంటుందని తెలిసింది. కేథరిన్ ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ సరైనోడులో మెరిసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments