Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత ఆర్య అయితేనేం... అడవిలో బిర్యానీ పెడతాడా: వాపోయిన కేథరీన్

అర్యతో కలిసి నటించిన కడంబన్ చిత్రం షూటింగ్‌ను కోడైకెనాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో తీశారు. అక్కడ అనుభవాలు భయంకరం అట. అక్కడ కరెంట్‌ లేదు, సెల్‌ఫోన్లు పనిచేయవు. మా కోసం ఆ ప్రాంతంలోని ఒక గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బస చేయడం, ఈ చిత్రంలో న

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (04:51 IST)
పుట్టింది కేరళలోని కొట్టాయం. పెరిగింది దుబాయ్. ఫ్యామిలీ అంతా అక్కడే నివాసం. కానీ నటనపై ఆసక్తితోనే కుటుంబాన్ని వదిలి ఇండియా వచ్చేశానంటున్న కేరళ కుట్టి కేథరీన్ ట్రెసా తక్కువ చిత్రాల్లో నటించినా అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలనే కోరికతో సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తోంది. అలా ఇష్టపడి ఈ మధ్య నటించిన కడంబన్ చిత్రం విశేషాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.
 
అర్యతో కలిసి నటించిన కడంబన్ చిత్రం షూటింగ్‌ను కోడైకెనాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో తీశారు. అక్కడ అనుభవాలు భయంకరం అట. అక్కడ కరెంట్‌ లేదు, సెల్‌ఫోన్లు పనిచేయవు. మా కోసం ఆ ప్రాంతంలోని ఒక గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బస చేయడం, ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం. చిత్రం ఆధ్యంతం కాళ్లకు చెప్పులు లేకుండా నటించారామె. 
 
ఆ ప్రాంతంలో షూటింగ్‌ అనగానే మొదట హడలిపోయాను. తమిళం, తెలుగు భాషల్లో నేను ఎంతగానో కష్టపడి నటించిన చిత్రం ఇదే. అన్నట్టు నేనీ చిత్రంలో ఫైట్స్‌ కూడా చేశాను. ఆర్యతో నటించడంతో ఆయన మీకు బిరియానీ వండి పెట్టారాఅని అడుగుతున్నారు. నట్టడవుల్లో బిరియానీ ఎలా లభిస్తుంది చెప్పండి. అయినా ఆహార విషయంలో నేను కొన్ని కట్టుబాట్లను విధించుకున్నాను. అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తాను అంటూ తనపై వచ్చిన రూమర్లను సున్నితంగానే తోసిపుచ్చారు కేథరీన్
 
ఒక తెలుగు చిత్రంలో సింగిల్‌ సాంగ్‌కు రూ.65 లక్షలు డిమాండ్‌ చేసి తీసుకున్నారటగా అని అడుగుతున్నారు. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు చేస్తున్న చిత్రం అది. అందులో ఒక పాటకు నటించమని అడిగారు. అందుకు వారు అనుసరించిన విధానం నచ్చడంతో నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని తీసుకుని నటించాను. అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ పోటీ ఉంది. దాంట్లో భాగంగానే ఎవరి అవకాశాలు వారికి దక్కుతున్నాయి అని తత్వం బోధించారీమె.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments