Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖిలాడి నుండి క్యాచ్ మీ అంటోన్న ర‌వితేజ‌, డింపుల్‌

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:07 IST)
Ravi Teja, Dimple Hayati
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ రోజు ఐదో పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.
 
క్యాచ్ మీ అంటూ సాగే ఈ పాటను ర‌వితేజ - డింపుల్ హయాతిల మీద చిత్రీక‌రించారు. ఈ పాటలో  డింపుల్ లుక్స్‌, కిల్ల‌ర్ ప‌ర్స‌నాలిటి, క‌ట్టిప‌డేసే ఎక్స్‌ప్రెష‌న్స్  ప్రేక్ష‌కుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ పాటతో గ్లామర్ విందు ఇచ్చింది డింపుల్‌.
 
దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకోసం మ‌రో మాస్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. శ్రీ మ‌ణి సాహిత్యం, నేహా బాషిన్, జ‌స్ప్రీత్ జాస్జ్ గానం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రీలీజ్ చేసిన అన్ని పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు.
 
సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments