Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇంత‌కీ.. పూరికి విజ‌యం వ‌చ్చేనా.?

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:09 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన ఈ డైరెక్టర్... హీరోల మేనరిజాన్ని.. దూకుడును చూపించడంలో పూరిని మించిన దర్శకులు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. పూరి తీసిన సినిమాలన్నీ ఆయా హీరోల జీవితాల్లో మరుపురాని చిత్రాలుగా నిలిచాయి. 
 
ఇటీవ‌ల కెరీర్లో వెన‌క‌బ‌డిన‌ పూరి జగన్నాథ్ ఈసారి ఎన‌ర్జిటిక్ హీరోను పట్టుకున్నారు. రామ్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ టీజర్ దుమ్ముదులిపింది. రామ్ దూకుడు, స్టైలిష్ చూసి ఎప్పుడూ లేని సరికొత్త దారిలో పూరి తన సినిమాను తీర్చిదిద్దినట్లు అంచనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 
 
రామ్ కూడా తన లుక్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ చేశాడు. రామ్ లుక్ అయితే మాస్ ఆడియెన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రామ్, పూరి జగన్నాథ్‌లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. స‌మ్మ‌ర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. 
 
అయితే... ఈ మూవీ విడుదల తేదీని పూరి అనౌన్స్ చేశాడు. జులై 12న ఈ సినిమాను విడుదల చేయనున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. సినిమాలోని యాక్షన్ సీన్స్ పూరి స్టైల్‌కి తగ్గట్టుగా ఉంటాయని.. ఈసారి అభిమానుల అంచనాలు అందుకుంటారని నమ్మకంగా చెబుతున్నారు. మ‌రి... ఈసారైనా పూరికి విజ‌యం వ‌రిస్తుందో లేదో చూద్దాం..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

Chhattisgarh: నక్సల్స్ ప్రాంతం.. ఐఈడీ పేలి తొమ్మిది మంది రిజర్వ్ గార్డ్స్ మృతి

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

Telangana: తెలంగాణ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments