Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిని బిజెపి ఆదేశిస్తుందా!

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (09:01 IST)
Pavankalyan, chieranjeevi
మెగాస్టార్ చిరంజీవి, త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాన్ రాజ‌కీయ‌పార్టీకి పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు నాదేండ్ల చెప్పిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌కు బ‌లం చేరుతున్నాయి. అస‌లు చిరు, ప‌వ‌న్ ఇద్ద‌రూ క‌లిసిమెలిసే వుంటారు. కానీ చాలాకాలంపాటు ఇద్ద‌రివీ ఆలోచ‌న‌లు వేరు. అంటూ అభిమానుల్లోనూ బ‌య‌ట ప్ర‌చారం జ‌రిగింది.  ఇక గ‌తంలో చిరంజీవి రాజ‌కీయా పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్‌లో క‌లిపేసిన‌ప్పుడు చాలా త‌ప్పు చేశార‌ని అంద‌రూ అన్నారు. ఇప్పుడు త‌మ్ముడు జ‌న‌సేన పార్టీ పెట్టి పోరాటం చేస్తూ కిందా మీదా ప‌డుతుండ‌గా మోడీని క‌లవ‌డం ఆ త‌ర్వాత ప‌రిణామాలు దేవాల‌యాల విధ్వంసం వెనుక ఎవ‌రో వున్నారో తెలిసిన‌ప్పుడు జ‌గ‌న్‌రెడ్డి ఎందుకు శిక్షించ‌లేదంటూ.. త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నించాడు ప‌వ‌న్‌. 
 
ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ వెనుక చిరంజీవి వున్నాడ‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పిన‌ట్లు వ‌స్తున్న వార్త నిజ‌మ‌ని తేలింది. ఇప్పుడు అన్న‌ద‌మ్ము లిద్ద‌రూ సినిమాల్లో బిజీగా వున్నారు. అందులో కొంత ఆర్థికంగా బ‌ల‌ప‌డి ఆ త‌ర్వాత రాబోయే ఎన్నిక‌ల్లో ఒక‌రికొక‌రు అండ‌గా వుంటార‌ని.. అప్పుడే పార్టీ బ‌లోపితం అవుతుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఫిలింన‌గ‌ర్ టాక్ ప్ర‌కారం... చిరంజీవిని ఇటీవ‌లే బిజెపి నాయ‌కులు కూడా మ‌ర్యాద‌పూర్వ‌కంగా కల‌వ‌డం కూడా పెద్ద ఆలోచ‌న వున్న‌ట్లు చెబుతున్నాయి.  బీజేపీతో పవన్ రెండోసారి కలసిన తర్వాత, సోము వీర్రాజు తన ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు మెగాస్టార్కు ధైర్యం వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.  పవన్ కల్యాణ్ ఇప్పటికే కాషాయంలోకి మార్చేసింది. రేపోమాపో చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి సదరు సామాజిక వర్గానికి జనసేన-బీజేపీయే ఏకైక దిక్కు అనేలా సీన్ క్రియేట్ చేయబోతున్నారు. 
 
కాగా, వి.స‌ముద్ర ద‌ర్శ‌క‌త్వంలో రేపు 29న విడుద‌ల‌కాబోతున్న `జైసేన‌` సినిమాకూడా ప‌వ‌న్ ఆశ‌యాల‌పైనే వుంది. అందులో రైతుల కోసం ప‌వ‌న్ ఎలుగెత్తి చాటిన స‌న్నివేశాలు, డైలాగ్‌లు కూడా ట్రైల‌ర్‌లో గోచ‌రిస్తున్నాయి. ఇది జైసే కాదు.. జ‌న‌సేన‌.. అంటూ ద‌ర్శ‌కుడు క్లారిటీగా చెప్ప‌డం.. పార్టీ ఆశ‌యాలు, త‌న ఆశయాలు ముందుముందు సినిమాల‌ల‌లో చొప్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రేపు రాబోయే ఆచార్య కూడా అందుకు మిన‌హాయింపుకాద‌నీ. రాజ‌కీయ అంశాలు, సామాజిక అంశాలు అందులో వుంటాయ‌ని తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments