స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల... వైకుంఠపురములో. ఈ బ్లాక్‌బస్టర్ మూవీలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టే. ముఖ్యంగా, బుట్టబొమ్మ పాట సోషల్ మీడియాలో ఓ సంచలనమైంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ పాటను తిలకించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
ఈ చిత్రంలోని పాటలను విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ తాజాగా వెల్లడించిన వివరాల మేరకు.. బుట్టబొమ్మ పాటకు ఇప్పటివరకు 450 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టు పేర్కొంది. ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే కూడా అదిరిపోయే హావభావాలతో పాటు.. స్టెప్పులతో అదరగొట్టిన విషయం తెల్సిందే.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్ఎస్ థమన్ సంగీత బాణీలను సమకూర్చారు. రామ్‌జో గేయ రచన చేయగా, ఆర్మాన్ మాలిక్‌కు నేపథ్యగానం సమకూర్చారు.