కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోన్న బ్రహ్మాస్త్ర..

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (12:35 IST)
బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాకు ఫస్ట్ డే చెప్పుకోదగిన కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు కూడా అదే హవా నడిపించి సత్తా చాటింది బ్రహ్మాస్త్ర భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘బ్రహ్మాస్త్ర’. 
 
తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అదే కంటిన్యూ చేస్తోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ తొలిసారి జంటగా కనిపించడం విశేషం. 
 
అదేవిధంగా అక్కినేని నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. 
 
సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే చెప్పుకోదగిన కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు కూడా అదే హవా నడిపించి సత్తా చాటింది బ్రహ్మాస్త్ర.  
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజుకు గాను 3.68కోట్లు రాబట్టిన బ్రహ్మాస్త్ర.. రెండో రోజు 2.62 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొదటి రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఈ సినిమాకు కాస్త కలిసొచ్చింది.
 
రెండో రోజుకు గాను అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీంతో ఈ రెండు రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.30కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా.. 11.75కోట్ల గ్రాస్ వసూలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.ఐదు కోట్ల వరకు బిజినెస్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments