Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురంటే నాకు అమితమైన ఇష్టం.. కమెడియన్స్ ఎవరూ ప్రోత్సహించలేదు : హాస్య'బ్రహ్మ'

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఇష్టమైన వారు ఎవరో హాస్యబ్రహ్మ వెల్లడించారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరనే కదా మీ సందేహం. ఆ ముగ్గురు ఎవరో కాదు.. జంధ్యాల, చిరంజీవి, రామానాయుడు అని హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చెప్పుకొచ

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (16:36 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఇష్టమైన వారు ఎవరో హాస్యబ్రహ్మ వెల్లడించారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరనే కదా మీ సందేహం. ఆ ముగ్గురు ఎవరో కాదు.. జంధ్యాల, చిరంజీవి, రామానాయుడు అని హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. అందుకే ఈ ముగ్గురంటే 'ఇష్టం, గౌరవం, ప్రాత:స్మరణీయులు' అని చెప్పారు. 
 
ఆయన ఆదివారం ఓ న్యూస్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 'సినిమా ఇండస్ట్రీలో నాకు గురువు గారు జంధ్యాల. నన్ను బాగా ప్రోత్సహించిన వారు చిరంజీవి. మంచి అవకాశాలు, పాత్రలిచ్చిన వారు రామానాయుడుగారు. ఈ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టమన్నారు. 
 
ఫిల్మ్ ఇండస్ట్రీలో తన గురువు అయిన జంధ్యాల పేరు చెప్పకుండా నేను ఉండలేను అన్నారు. ఇక తాను ఎంకరేజ్ చేసిన హాస్యనటులెవరూ లేరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా జంధ్యాల చెప్పిన కొన్ని మాటలను బ్రహ్మానందం ప్రస్తావించారు.
 
‘మీ దయ వల్ల నేను ఇంతటివాడిని అయినాను అని ఒకసారి జంధ్యాలగారితో అన్నాను. ‘డోంట్ సే లైక్ దట్ బ్రహ్మానందం. నువ్వు ఆరోజు ఎక్కిన బస్సులో నేను డ్రైవర్‌ను మాత్రమే. నేను కాకపోతే ఇంకొకరు డ్రైవర్‌గా ఉంటారు. కానీ, బస్సు చేరాల్సిన గమ్యం చేరుతుంది. ఆఫ్‌ట్రాల్ ఐయామ్ లైక్ దట్’ అని ఆ రోజున జంధ్యాల అన్నారని బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments