Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మా' ఎన్నికలపై జింగ్‌పిన్‌తో చర్చించానంటున్న బ్రహ్మాజీ

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (14:49 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటుల వేదిక అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే సెప్టెంబరు నెలలో జరుగనున్నాయి. అయితే, ఎన్నికల వేడి మాత్రం అపుడే రాజుకుంది. హీరో మంచు విష్ణు, నటుడు ప్ర‌కాశ్‌రాజ్‌, సీనియర్ నటి జీవితా రాజ‌శేఖ‌ర్‌, నటి హేమ, నటుడు సీవీఎల్ న‌ర‌సింహా రావులు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో మీడియా అటెన్ష‌న్ అంతా ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌పై ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ ఓ పోస్టుతో అంద‌రినీ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇంత‌కీ బ్ర‌హ్మాజీ ఏ పోస్ట్ పెట్టాడో తెలుసా? చైనా అధ్య‌క్షుడు జింగ్‌పిన్‌ను క‌లిసిన ఫొటో. 
 
ఇందులో బ్ర‌హ్మాజీకి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి జింగ్ పిన్ ప్ర‌య‌త్నిస్తే ఆయ‌న మాత్రం న‌మ‌స్క‌రిస్తున్నారు. ఈ ఫొటోతో పాటు 'ఇది సాధార‌ణ మీటింగ్ మాత్ర‌మే. ఎలాంటి రాజ‌కీయాల‌కు తావులేదు. ‘మా’ ఎన్నిక‌ల గురించి చ‌ర్చించాం. ఆయ‌న కొన్ని టిప్స్ చెప్పారు' అంటూ బ్రహ్మాజీ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఇది ఫ‌న్నీగా ఉండ‌టంతో వైర‌ల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments