Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి ఇలా చేశాడా... తమ్ముడ్ని వద్దని అన్నయ్యను ఓకే చేశాడా..? అయ్యోపాపం

మెగాస్టార్ చిరంజీవి సినిమాను ఓకే చేసిన బోయపాటి శ్రీను.. తమ్ముడు పవన్ కల్యాణ్‌‌ను వద్దన్నాడు. చిరంజీవి త‌న కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న 150వ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సిన

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (16:38 IST)
మెగాస్టార్ చిరంజీవి సినిమాను ఓకే చేసిన బోయపాటి శ్రీను.. తమ్ముడు పవన్ కల్యాణ్‌‌ను వద్దన్నాడు. చిరంజీవి త‌న కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న 150వ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి రావ‌డం ఖరారైంది. ఈ సినిమా త‌ర్వాత చిరు త‌న 151వ సినిమాలో గ్యాప్ లేకుండానే న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. చిరు 151వ సినిమా యాక్ష‌న్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుంద‌ని స‌మాచారం. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవి-బోయ‌పాటి శ్రీను అధికారికంగా ఖ‌రారైన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ చిరంజీవికి బాగా న‌చ్చింద‌ట‌. అల్లు అర‌వింద్ బోయ‌పాటికి అడ్వాన్సు కూడా ఇచ్చేశార‌ట‌. ఇదిలా ఉంటే అన్న చిరు సినిమాకు ఓకే చెప్పి.. అడ్వాన్స్ తీసుకున్న బోయ‌పాటి అదే స‌మ‌యంలో చిరు త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాకి బోయ‌పాటి నో చెప్పార‌ట‌.
 
ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న తార‌క‌ప్ర‌భు ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కే 38వ సినిమాను ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. బోయపాటి నో చెప్పడంతో ఇక చేసేది లేక దాసరి సినిమా పనుల్లో పవన్ నిమగ్నమైనట్లు టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. దీంతో దాసరి నిర్మిస్తున్న చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తారనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లైందని సినీ పండితులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments