Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులిచ్చిన మాజీ భార్యతో హీరో చెట్టాపట్టాల్... డిన్నర్‌కు తీసుకెళ్లీ...

భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఇక జన్మలో ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి వుండదు. ఎందుకంటే భార్యాభర్తల బంధాన్ని తెంచుకునేంతట గాయం ఇద్దరిలో ఎవరికో అయితేనే విడాకులు దాకా వెళ్తుంది జంట. ఒక్కసారి విడాకులయ్యాక మళ్లీ వారిద్దరూ కలవడమంటే... దాదాపు వుండదన

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (17:06 IST)
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఇక జన్మలో ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి వుండదు. ఎందుకంటే భార్యాభర్తల బంధాన్ని తెంచుకునేంతట గాయం ఇద్దరిలో ఎవరికో అయితేనే విడాకులు దాకా వెళ్తుంది జంట. ఒక్కసారి విడాకులయ్యాక మళ్లీ వారిద్దరూ కలవడమంటే... దాదాపు వుండదనే చెప్పొచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ తీసికట్టు. పొద్దున్నే విడాకులు తీసుకుని సాయంత్రానికి ఇద్దరూ ఎంచక్కా డిన్నర్ చేసి, ఆ తర్వాత సొంత ఫ్లాటులో ఇద్దరూ కలిసి నిద్రించే పరిస్థితికి వెళ్లిపోయింది వ్యవహారం. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఇదిగో బాలీవుడ్ హీరో సంగతే.
 
హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసాన్నే ఖాన్ వ్యవహారం చూస్తుంటే ప్యాచప్ పడినట్లే కనిపిస్తోందంటున్నారు బాలీవుడ్ సినీ జనం. దానికి బలాన్ని చేకూరుస్తూ... గత రాత్రి ఇద్దరూ కలిసి ఓ హోటలులో డిన్నర్ చేస్తూ కనిపించారట. అర్థరాత్రి వరకూ బయటకు రాలేదట. పైగా హోటలులోకి వెళ్లేటపుడు ఇద్దరూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపించారట.
 
విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులుగా వుండిపోయామని చెపుతున్నారు వీరిద్దరూ. మూడు సంవత్సరాల క్రితం వీరిరువురూ విడిపోయారు. విడిపోయారన్నమాటే కానీ కలిసి తిరగకుండా కనిపించిన సంఘటనలు దాదాపు అరుదు. కంగనా రనౌత్ న్యాయపరమైన చిక్కులను హృతిక్ కు కలిగించిన సందర్భంలో ఈ మాజీ భార్య అతడికి వెన్నుదన్నుగా నిలించిందట. ఆ తర్వాత విడాకుల సంగతి పక్కనపడేసి పిల్లాజల్లాతో హాయిగా తిరుగుతున్నారు. మొత్తమ్మీద కంగనా రనౌత్ వీరి బంధాన్ని మళ్లీ గట్టిగా అతికించిందేమోనని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. నిజమేనేమో మరి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments