Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు నేను రెడీ అవడం చాలా ఈజీ... నాకు జుట్టు లేదు కదా... సోనాలి బింద్రే పోస్ట్

సోనాలీ బింద్రే అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఇంద్ర. ఈ చిత్రంతో సోనాలీ బాగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. నాగార్జున మన్మథుడు, చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలతోపాటు ఖడ్గం తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్య

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (18:41 IST)
సోనాలీ బింద్రే అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఇంద్ర. ఈ చిత్రంతో సోనాలీ బాగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. నాగార్జున మన్మథుడు, చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలతోపాటు ఖడ్గం తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ఈ తార ప్రస్తుతం  హైగ్రేడ్ క్యాన్స‌ర్‌తో న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఆమెకు కీమో థెరపీ జరుగుతోంది. ఈ చికిత్స సమయంలో వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. తలపై కేశాలతోపాటు నొసలపై వున్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఇలాంటి చికిత్సను మనోధైర్యంతో ఎదుర్కొంటున్న సోనాలీ బింద్రే ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన స్నేహితులతో దిగిన ఫోటోను షేర్ చేశారు. 
 
తను ఒంటరిగా ఒత్తిడికి లోనుకాకుండా నా స్నేహితులు నన్ను ఎంతగానో అండగా వున్నారంటూ చెప్పుకున్నారు. అంతేకాకుండా తను కష్టసమయం నుంచి బయటకు రావాలంటూ ఎంతోమంది సందేశాలు పంపిస్తున్నారనీ, వారందరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపారు. ఇకపోతే తనిప్పుడు రెడీ అవడానికి పెద్దగా టైం పట్టడంలేదనీ, ఎందుకంటే తనకు జుట్టు లేదు కదా అంటూ గుండెల్ని పిండేసే పోస్ట్ చేశారు సోనాలీ. ఆమె త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments