Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేవాచ్ హీరోయిన్ తెలుగు, తమిళం మాట్లాడుతుందా.. అయితే హాలీవుడ్ మనకు ఇంకా దగ్గరే మరి

బాహుబలి 2 సాధించిన విజయం హాలీవుడ్‌ని ఒక్కసారిగా భారతీయ చిత్రపరిశ్రమవైపు మళ్లించినట్లుంది. ఇండియన్ సినిమా దేశవిదేశాల్లో మార్కెట్‌ను కొల్లగొడుతుండగా తామెందుకు భారతీయ చిత్రసీమలో అడుగుపెట్టకూడదన్న ఆలోచన హాలీవుడ్‌పై బాగా పడినట్లుంది. ఈ కోవలో తొలిదాడి బేవా

Webdunia
శనివారం, 27 మే 2017 (05:11 IST)
బాహుబలి 2 సాధించిన విజయం హాలీవుడ్‌ని ఒక్కసారిగా భారతీయ చిత్రపరిశ్రమవైపు మళ్లించినట్లుంది. ఇండియన్ సినిమా దేశవిదేశాల్లో మార్కెట్‌ను కొల్లగొడుతుండగా తామెందుకు భారతీయ చిత్రసీమలో అడుగుపెట్టకూడదన్న ఆలోచన హాలీవుడ్‌పై బాగా పడినట్లుంది. ఈ కోవలో తొలిదాడి బేవాచ్ రూపంలో వచ్చింది. ఇకపై హాలీవుడ్ సినిమాలన్నీ భారతీయ భాషలను కూడా మాట్లాడనున్నాయి మరి.
 
బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్‌ చిత్రం బెవాచ్‌ తెలుగు, తమిళం మాట్లాడనుంది. చాలా కాలం కిందట కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా తమిళన్‌ చిత్రంలో కథానాయకిగా నటించిన ప్రియాంక చోప్రా ఆ తరువాత నిరంతర కృషి, పట్టుదల, నటనాభినయంతో బాలీవుడ్‌లో టాప్‌ నాయకిగా ఎదిగారు. తాజాగా హాలీవుడ్‌ నటి అంతస్తును అందుకున్న ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం బెవాచ్‌.
 
వేయ్‌న్‌ జాన్సన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సేత్‌ కోర్టన్‌ అనే హాలీవుడ్‌ దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో హీరో సముద్ర తీర ప్రాంతంలో సేద తీర్చుకోవడానికి వచ్చే ప్రజలు ఏదైనా ప్రమాదానికి గురైతే వారిని రక్షిస్తుంటాడు. ఇక నటి ప్రియాంక చోప్రా మాదక ద్రవ్యాల ముఠాకు చెందిన విక్టోరియా లీట్స్‌ అనే యువతిగా నటించారు. విశేశం ఏమిటంటే ఇది హాలీవుడ్‌లో బహుళ ప్రాచుర్యం పొందిన ఒక టీవీ సీరియల్‌ ఆధారంగా తెరకెక్కిన చిత్రం.
 
ఇందులో యాక్షన్, వినోదం వంటి అన్ని వర్గాలను అలరించే సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అనువదించి విడుదల చేస్తున్న హూ బాక్స్‌ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లియిటెడ్‌ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. పారామౌంట్‌ ఫిలింస్‌ సంస్థ శుక్రవారం ఈ హాలీవుడ్‌ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. కాగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో జూన్‌ 2న విడుదల చేయనున్నట్లు హూ బాక్స్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్వాహకులు తెలిపారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Clarity on Retirement Age ఉద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పు లేదు : కేంద్రం

Tirupati Girl Reels At Alipiri మోడ్రన్ దుస్తుల్లో కిస్సిక్ పాటకు రీల్.. సారీ చెప్పిన యువతి

YS Sharmila Sensational Comments జగన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు డబ్బులు అందాయా?

భూకంపం: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు జిల్లాలు తప్ప మిగతా ప్రాంతమంతా సేఫ్ జోన్‌లోనే’

ఎగిరే చేపలు.. తిమింగలం, గరుడ పక్షి నుంచి తప్పించుకుని.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments