Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహస జంప్‌ చేస్తూ గాయపడిన బాలీవుడ్ నటి నటాషా సూరి (వీడియో)

బాలీవుడ్ నటీమణి, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటాషా సూరి ప్రమాదంలో చిక్కుకుంది. ఇండోనేషియాలో చిక్కుకున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్‌ సిరీస్‌లో ఇటీవల మెరిసిన

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (16:07 IST)
బాలీవుడ్ నటీమణి, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటాషా సూరి ప్రమాదంలో చిక్కుకుంది. ఇండోనేషియాలో చిక్కుకున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్‌ సిరీస్‌లో ఇటీవల మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. రియాల్టీ కోసం సాహసం చేసింది. ఇటీవల ఇండోనేషియా పర్యటనకు ఓ స్టోరీ ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లిన నటాషా ప్రమాదానికి గురైంది. 
 
లగ్జరీ బ్రాండ్ స్టోరీ ఆరంభోత్సవంలో రిబ్బన్ కటింగ్‌కు వెళ్లిన నటాషా.. బంగీ జంపింగ్‌ కోసం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఓ సరస్సులోకి దూకేందుకు ప్రయత్నించిన నటాషా రోప్ కార్డ్ మధ్యలోనే తెగడంతో తలకు తీవ్రగాయమైంది. పై నుంచి ఒక్కసారిగా సరస్సులో పడిన నటాషా తీవ్రగాయాలకు గురైంది. వెంటనే నటాషాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో వుంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా 2006లో నటాషా సూరి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. 2016న నటిగా అవతారమెత్తిన నటాషా మలయాళంలో కింగ్ లియర్‌లో హీరో దిలీప్‌కు జోడీగా నటించారు. అంతేగాకుండా డజన్ల సంఖ్యలో టీవీ షోలకు ఆమె ఆతిథ్యమిచ్చింది.
 
బిగ్ స్విచ్ఛ్, సూపర్ డూడ్, సెల్ గురు, స్టైల్ పోలిస్ వంటి షోల్లో నటాషా నటించింది. తద్వారా 2016లో మాక్సిమ్స్ జాబితాలో టాప్-100లో నిలిచింది. తాజాగా మనీష్‌ పాల్‌తో బాబా బ్లాక్ షీప్ అనే చిత్రంలో నటించింది. ఈ నేపథ్యంలో నటాషా గాయం నుంచి కోలుకుని బిటౌన్‌లోకి అడుగుపెట్టాలని సినీ జనంతో పాటు ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోడీ నా‌పై‌ చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలువైనది...

ఆపరేషన్‌ బుడమేరు: విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, ఆక్రమణల మాటేంటి?

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఎంపికపై వీడని ఉత్కంఠ - హస్తినకు ఆ ముగ్గురు నేతలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments