Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్ జస్ట్ ఎస్కేప్... డ్రైవరు స్టీరింగుపై స్పృహ కోల్పోయాడు...

రోజూ కార్లు నడిపే డ్రైవర్లు కారు నడిపే తీరు చూస్తే మనకు కళ్లు తిరుగుతాయ్. ధ్యాముడా... వీడు గమ్య స్థానానికి జాగ్రత్తగా చేర్చితే అదే పదివేలు... అనుకుంటూ కళ్లు మూసుకుని ప్రయాణం చేస్తాము. బాలీవుడ్ నటి కంగానా రనౌత్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. తన

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (18:50 IST)
రోజూ కార్లు నడిపే డ్రైవర్లు కారు నడిపే తీరు చూస్తే మనకు కళ్లు తిరుగుతాయ్. ధ్యాముడా... వీడు గమ్య స్థానానికి జాగ్రత్తగా చేర్చితే అదే పదివేలు... అనుకుంటూ కళ్లు మూసుకుని ప్రయాణం చేస్తాము. బాలీవుడ్ నటి కంగానా రనౌత్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. తను నటిస్తున్న సిమ్రాన్ సినిమా షూటింగ్ అమెరికాలోని జార్జియాలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ ముగించుకున్న కంగనా స్థానిక హోటలుకు వెళ్లేందుకు కారు ఎక్కింది. అక్కడి స్థానిక డ్రైవరు కావడంతో అతడు కారును శరవేగంతో నడుపుతున్నాడు. 
 
ఆ సమయంలో హఠాత్తుగా అతడికి ఊపిరాడకుండా దగ్గు వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఐతే కారు స్పీడును మాత్రం తగ్గించలేదు. కంగనా, ఆమె సెక్యూరిటీ సిబ్బంది పెద్దగా అరుస్తున్నా అతడు మాత్రం అదే వేగాన్ని కొనసాగించాడు. అలాగే అతడి దగ్గూ ఓ పట్టాన ఆగలేదు. విపరీతం కావడంతో స్పృహ కోల్పోయి స్టీరింగుపైనే పడిపోయాడు. దాంతో కారు హైవే లైన్స్‌‌ను దాటేసి ఐరన్‌ ఫెన్సింగ్‌‌కు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ కంగానా చిన్నచిన్న గాయాలతో బయటపడింది. నుదురు, చేతులకు మాత్రమే గాయలయ్యాయి. గాయాలపాలైనప్పటికీ సినిమా షూటింగులో పాల్గొంది కంగనా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments