Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ కాంప్లెక్స్‌లో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు... ఎవరు?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (17:38 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దీపావళి పండుగకు ముందు ఓ విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు అసిఫ్ బాస్రా. ఈయన ధర్మశాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయన వయసు 53 యేళ్లు. 
 
గత కొన్ని రోజులుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతూ వచ్చిన ఆయన... మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బాలీవుడ్‌లో డిప్రెషన్ అనే పదం ఈ మధ్య చాలా వ్యాపిస్తుంది. జూన్ 14న స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు కూడా ఇలాగే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. 
 
కాగా, అసిఫ్ ఫ్యానుకు ఉరేసుకొని ఆసీస్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ధర్మశాలలోని ఆ కాంప్లెక్స్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు మీడియాకు చెబుతామని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. 
 
ఆసిఫ్ మరణవార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న నటులు దర్శకులు నిర్మాతలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైన నటుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అసలు ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments