Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె ధ‌నిక భార‌తీయురాలంటున్న సోనూసూద్‌

Webdunia
గురువారం, 13 మే 2021 (15:26 IST)
Boddu Naga Lakshmi
దేశంలో ఆస్తి, అంత‌స్తులు, డ‌బ్బు, ద‌ర్పం, కీర్తి, ప‌ద‌వి వుంటే చాలదు. మాన‌వ‌త్వం వుండాలంటారు పెద్ద‌లు. మాన‌వ సేవే మాధవ సేవ అని పురాణాలు చెబుతున్నాయి. అలా మాధవ సేవ చేసేవారు చాలా మంది దేశంలో వున్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా, ఇతర‌త్రా కార‌ణాల‌ వ‌ల్ల కొంద‌రు త‌మ వంతు సాయంగా ఎంతో కొంత అర్హుల‌కు చేస్తూనే వుంటారు. ఇప్పుడు క‌రోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజ‌న్ అంద‌క‌, స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఆసుప‌త్రికి రాలేక‌పోతున్నారు చాలామందే వున్నారు. సోనూసూద్ వంటి మాన‌వ‌తావాది చేస్తున్న సేవ‌లు చెప్ప‌న‌ల‌వి కావు.
 
ఇక త‌న పేరుతో వున్న సూద్ ఫౌండేష‌న్‌కు ఎవ‌రైనా సాయం చేయ‌వ‌చ్చ‌ని సోనూసూద్ ప్ర‌క‌టించ‌గానే వేళ్ళ‌మీద లెక్కించే వ్య‌క్తులు స్పందించారు. అలాంటిది ఓ అంధురాలు స్పందించి ఆయ‌న‌కు అండ‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని వరికుంటపాడు అనే చిన్న గ్రామం నుండి బొడ్డు నాగ‌ల‌క్ష్మి అనే ఆమె త‌న వంతు సాయంగా సూద్ ఫౌండేషన్‌కు 15,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆమె అక్క‌డ అంద‌రికీ తెలిసిన అంధురాలే కాకుండా  యూట్యూబర్ కూడా. ఆమె త‌న ఐదు నెల‌ల పెన్ష‌న్‌ను ఇలా ఫౌండేష‌న్‌కు అంద‌జేసింది.
 
అందుకు సోనూసూద్ స్పందించారు. నాకు ఆమె ధనిక భారతీయురాలు. ఒకరి బాధను చూడటానికి మీకు కంటి చూపు అవసరం లేదు. ఎ ట్రూ హీరోఫ్లాగ్ ఆఫ్ ఇండియా అంటూ సూద్ ట్వీట్ చేశాడు. ఈ సంఘ‌ట‌న‌ను పాల‌కులు కూడా ఛాలెంజ్‌గా తీసుకోవాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments