Webdunia - Bharat's app for daily news and videos

Install App

బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్‌: అభిమాని అనుమానాస్పద మృతి

Webdunia
శనివారం, 30 జులై 2022 (14:06 IST)
Bimbisara
బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అయితే, ఈ ఫంక్షన్‌లో ఓ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం ఆలస్యంగా వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
 
మృతుడిది ఆంధ్రప్రదేశ్‌‌గా గుర్తించారు. కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అభిమాని మృతి చెందడం ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది.  
 
ఇకపోతే.. తాడేపల్లిగూడేనికి చెందిన పుట్టా సాయిరామ్ కూకట్‌పల్లిలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇతను బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. 
 
ఈవెంట్‌కి వచ్చిన సాయిరామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దాంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ మృతిపై పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

వెస్ట్ గోదావరి జిల్లా, పెంటపాడు మండలానికి చెందిన అభిమాని పుట్టా సాయిరామ్‌(సన్నాఫ్‌ రాంబాబు) మృతి పట్ల `బింబిసార` యూనిట్‌ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈవెంట్‌లో దురదృష్ణవశాత్తు అభిమాని మరణించాడనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపింది.

పుట్టా సాయిరామ్‌ లేదనేది నిజంగా గుండెపడిలే వార్త. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామని, సాయిరామ్‌ కుటుంబాన్ని సాధ్యమైన విధంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments