Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షోలో ఆట కంటే కంటెస్టెంట్స్ గోలే ఎక్కువగా ఉందా?

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (13:38 IST)
Bigg Boss 8
బిగ్ బాస్ షోలో ఆట కంటే కంటెస్టెంట్స్ తీట వ్యవహారాలకు ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు లేకపోలేదు. ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక ప్రేమ జంటను హౌస్‌లో నిర్వాహకులు ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఎవరు ఎవరిని తగులుకోవాలనే కాన్సెప్ట్‌ను ముందే, అన్నీ ప్లాన్ చేసుకుని, కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపిస్తుంటారనే విమర్శలు అధికంగానే వస్తున్నాయి. 
 
అందుకు తగ్గట్టే, కొన్ని జంటలు హద్దులు దాటి మరీ ప్రవర్తించడం జరుగుతోంది.ఈ సీజన్‌లో పృథ్వీ, విష్ణుప్రియ మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందనట్లు ఉద్దేశపూర్వకంగా హైలైట్ చేస్తున్నారు. విష్ణు ప్రియ మరీ గారాలు పోతే, పృథ్వీ ఆమెని సముదాయించటం మొదటి నుంచి నడుస్తోంది. 
 
చూటడానికి అది ఎబ్బెట్టుగా, చిరాగ్గా ఉంటుంది కూడా. కాగా లేటెస్ట్ ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్‌లో, పలువురు కంటెస్టెంట్లు, విష్ణు ప్రియ పృథ్వీ మధ్య వ్యవహారంపై కామెంట్స్ చేశారు. వారి ముతక కెమిస్ట్రీని ప్రస్తావిస్తూ.. ఇద్దరిని  విడివిడిగా కొందరు నామినేట్ చేయడమూ జరిగిందని తెలిపారు. 
 
వారి వ్యవహారంపై నామినేషన్ల పర్వం ముగిశాక, యష్మి నేరుగా పృథ్వీని అడగ్గా, నేను ఆమె వద్దకు వెళ్ళను. ఆమె మాత్రం వస్తుంటుందని పృథ్వీ తెలిపాడు. తాను అందరితో ఉన్నట్లే విష్ణు ప్రియతోనూ అలానే ఉంటానని పృథ్వీ స్పష్టం చేశాడు. ఆ తర్వాత విష్ణు ప్రియ వద్దకు వెళ్లి మరీ మనిద్ధరి మధ్యా వేరే ఏదీ లేదు కదా.. అని అడిగేసరికి విష్ణు ప్రియ షాక్‌కి గురైంది. ఏమీ లేదు.. అని మొహమాటంగానే విష్ణు ప్రియ చెప్పేసి, పృథ్వీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. 
 
ఇలా ఈ బిగ్ బాస్ ఫేక్ ప్రేమల వ్యవహారంతో యువతకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నారనేది అర్థం కావట్లేదు. గతంలో ష్మణుక్, సిరి ఎవరికి వారే పర్సనల్ రిలేషన్ షిప్‌లో ఉన్నా, హౌస్‌లో వారి మధ్య ఎదో బాండింగ్‌ను క్రియేట్ అయినట్లు చూపారు.

షోలో దమ్ములేనప్పుడు.. కంటెస్టెంట్స్ మధ్య ఈ తరహా వ్యవహారాలను హైలైట్ చేయటం, అది కూడా ఫ్యామిలీ రియాల్టీ షో పేరుతో చీప్ ట్రిక్స్‌ను ప్లే చేయటం వల్ల రానూ రానూ బిగ్ బాస్ ప్రాభవం తగ్గిపోతూ వస్తుందనే కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments