Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్-7 ఊహలకు అందదు.. సీన్‌లోకి సురేఖా వాణి-సుప్రిత?!

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:04 IST)
Bigg Boss 7 Season
బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో  స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ఈ భారీ రియాలిటీ షో ఊహలకు అందని రీతిలో వుంటుందని షో యాంకర్, నటుడు నాగార్జున చెప్పారు.  
 
గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ రేటింగ్ తగ్గినప్పటికీ, ఈసారి ప్రోమోలు చూస్తే సరికొత్త బిగ్ బాస్ షోను చూడవచ్చునని నమ్మకం కలుగుతుంది. హోస్ట్ నాగార్జున కూడా అదే చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ ప్రోమోలో తెలియజేశారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. 
 
అంతా ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టార్ మా చానల్  బిగ్ బాస్-7 తాజా ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో చిన్న స్కిట్‌ను కూడా ప్రదర్శించారు.
 
మరోవైపు మరికొద్ది రోజుల్లో తెలుగు బిగ్ బాస్ 7 షురూ కానున్న నేపథ్యంలో ఈ షోకి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ.. దాదాపుగా ఖరారు అయ్యినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కార్తీక దీపం శోభా శెట్టి, విష్ణు ప్రియ, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి, నవ్య స్వామి, సురేఖావాణి, ప్రభాకర్ పేర్లు ఇప్పటికైతే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ వేదికపై ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉండేలా సన్నాహాలు చేస్తున్నారట. ఈ షోలో సురేఖా వాణి కూతురు సుప్రితను కూడా రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments