Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌ బాస్' సీజన్ 5 షురూ... కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదేనా?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:25 IST)
బుల్లితెరపై బోలెడంత వినోదాన్నిపంచే కార్యక్రమాల్లో 'బిగ్ బాస్' ఒకటి. ఇది మరోమారు సందడి చేసేందుకు సిద్ధమైంది. 'బిగ్ బాస్ సీజన్-5' రియాల్టీ షో ప్రసారాలు త్వరలోనే ప్రసారంకానున్నాయి. 
 
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం తెల్సిందే. గత నాలుగు సీజన్లలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆలరించింది. ఇక తెలుగులో ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. 
 
మరోవైపు, ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ పేర్లు ఒక్కొక్కటిగా లీకవుతున్నాయి. అయితే కొత్త కొత్త పేర్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రేపు (సెప్టెంబర్ 5న) బిగ్‏బాస్ స్టార్ట్ కాబోతుండడంతో బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
అయితే లెటేస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ షో రేపు ప్రారంభం కాబోతుండడంతో ఈరోజే కంటెస్టెంట్లను హౌస్‏లోకి పంపుతున్నారు నిర్వహకులు. గత కొద్ది రోజులుగా తాజ్ డెక్కన్, మారియట్ హోటల్లలో క్యారంటైన్‏లో ఉన్న పార్టిసిపెంట్లను ప్రస్తుతం హౌస్‏లోకి ప్రవేశపెడుతున్నారు. శనివారం సాయంత్రానికి బిగ్‏బాస్ హౌస్ ఎంట్రీ పూర్తి కానుంది. ఇక రేపు సాయంత్రం బిగ్‏బాస్ ప్రసారం కానుంది. 
 
మరోవైపు, బిగ్‏బాస్ హౌస్‏లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్‌ పేర్లను ఓ సారి పరిశీలిస్తే, యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్‏లోకి వెళ్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments