Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్‌ హౌస్-5: 15 రోజుల పాటు క్వారంటైన్.. సెప్టెంబర్ 5న నేరుగా..?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (16:04 IST)
బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు చెక్‌ పెడుతూ ప్రోమో వదిలిన నిర్వాహకులు.. తాజాగా మరో సర్‌ప్రైజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న మరో ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
 
ఈ ప్రోమో షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎంపిక కూడా పూర్తి చేశారట. ఆగస్ట్‌ 22 నుంచి వారికి క్వారంటైన్‌కు తరలించనున్నట్లు సమాచారం. అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్‌ చేసి, సెప్టెంబర్‌ 5న నేరుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారట. ప్రతి కంటెస్టెంట్‌కి రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారట.
 
అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్‌ మీడియాలో ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది. అందులో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments