Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బిగ్ బాస్ షో చూడను.. షణ్ముఖ్ జశ్వంత్ జెన్యూన్ పర్సన్.. ఎవరు? (video)

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:21 IST)
బిగ్ బాస్ గురించి ప్రముఖ బుల్లితెర యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియ నెగటివ్ కామెంట్స్ చేసింది. తాను బిగ్ బాస్ షోను చూడనని విష్ణుప్రియ వెల్లడించడం గమనార్హం. తాను షో చూడను కాబట్టి ప్రత్యక్షంగా బిగ్ బాస్ హౌస్ లోని ఏ కంటెస్టెంట్ కు మద్దతు ప్రకటించనని విష్ణుప్రియ పేర్కొన్నారు.

తనకు బిగ్ బాస్ షో కాన్సెప్ట్ అస్సలు నచ్చదని విష్ణుప్రియ వెల్లడించారు. భవిష్యత్తులో కూడా తాను బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే అవకాశం అయితే లేదని విష్ణుప్రియ కామెంట్లు చేయడం గమనార్హం.
 
ఇకపోతే.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రతి సీజన్‌కు మంచి రేటింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లోని కొందరు కంటెస్టెంట్లకు సెలబ్రిటీలు సైతం మద్దతు ప్రకటిస్తూ ఆయా కంటెస్టెంట్లకు ఓట్లు ఎక్కువగా వచ్చేలా చేస్తున్నారు. ఈ షోపై విష్ణుప్రియ ఇంకా మాట్లాడుతూ.. తాజాగా సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ గురించి చెప్పారు.
 
షణ్ముఖ్ చాలా జెన్యూన్ పర్సన్ అని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్ లేకపోయినా షణ్ముఖ్ జశ్వంత్ సొంతంగా ఫ్లాట్ ఫామ్ ను క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎదిగాడని విష్ణుప్రియ అన్నారు. షణ్ముఖ్ జశ్వంత్‌కు అంతా మంచే జరగాలని తాను ఆశిస్తున్నానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. అయితే షణ్ముఖ్ ను తెగ పొగిడిన విష్ణుప్రియ బిగ్ బాస్ షో గురించి మాత్రం నెగిటివ్ కామెంట్లు చేశారు.

 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments