Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ : ఓవియాకు బింధుమాధవి సపోర్ట్.. గాయత్రి టీమ్‌కు చిర్రెత్తుకొచ్చింది..

తమిళ బిగ్ బాస్ కార్యక్రమంపై ప్రస్తుతం నెట్టింట్లో ఒకటే చర్చే కాదు రచ్చ కూడా జరుగుతోంది. బిగ్ బాస్ షోను ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ షోల

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (14:24 IST)
తమిళ బిగ్ బాస్ కార్యక్రమంపై ప్రస్తుతం నెట్టింట్లో ఒకటే చర్చే కాదు రచ్చ కూడా జరుగుతోంది. బిగ్ బాస్ షోను ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ రెండు గ్రూపులుగా వ్యవహరిస్తున్నారు. ఒకటి ఓవియా- రెండోది కొరియోగ్రాఫర్ గాయత్రీ రఘురాం గ్రూపు. ఓవియా అంటే గాయత్రికి నచ్చని విధంగా ప్రోమోలు వస్తున్నాయి. 
 
ఒకానొక దశలో గాయత్రీ తన గ్యాంగ్‌తో కలిసి బిగ్ బాస్ హోస్‌లో ఓవియాను ఏడ్పించినట్లు ప్రోమోలొచ్చాయి. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో ఓవియా ఏడవగానే.. ఒక్కసారిగా నెటిజన్లు, ప్రేక్షకులందరూ.. ఓవియాకు మద్దతు పలికారు. ఓవియా పేరుతో నెటిజన్ల చర్చ పెద్ద ఎత్తున సాగడంతో ఆమెపై సేవ్ ఓవియా పేరిట హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చింది. ఇంతలా ఓవియాకు క్రేజ్ పెరిగిపోతోంది.  
 
ప్రేక్షకులతో పాటు, సినీతారల మద్దతు కూడా ఆమెకు లభిస్తోంది. సినిమాల్లో రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా ఆమెకు లభిస్తోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఓవియాను గాయత్రి టీమ్ మాటలతో ఎత్తిపొడుస్తూ.. ఆమెను మానసికంగా వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఓవియాకు మరో సినీ నటి మద్దతు లభించింది. బింధు మాధవి బిగ్ బాస్ హౌస్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె కూడా ఓవియాకు సపోర్ట్ చేయడం గాయత్రి జీర్ణించుకోలేకపోతోంది. 
 
ఓవియాకు జరుగుతున్న వేధింపులపై బింధు మాధవి గాయత్రిని నిలదీస్తోంది. ఈ మేరకు ఓ ప్రోమోలో గాయత్రి ఓవియాను ఉద్దేశించి ఓ పాట పాడటంతో ఇలాంటి ద్వంద అర్థాల పాటలెందుకు అని ప్రశ్నించింది. ఇలా ఓవియాకు బింధుమాధవి సపోర్ట్ చేయడంతో గాయత్రీ గ్యాంగుకు చిర్రెత్తుకొస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments