Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 5 నుంచి బిగ్ బాస్ : ఆగస్టు 22 నుంచి క్వారంటైన్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (16:04 IST)
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న రియాలిటీ షోలలో ఒకటి బిగ్ బాస్. తెలుగులో మంచి రేటింగ్‌ ప్రసారమైంది. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో ఐదో సీజ‌న్ ప్రారంభంకానుంది. ఈ సీజన్ సెప్టెంబరు 5న నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఈ నెల 22వ తేదీ నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. 
 
నిజానికి బిగ్ బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్స్ వీరేనంటూ లీకు రాయుళ్లు ప‌లువురి పేర్లు బ‌య‌పెట్టారు. కొద్ది రోజులుగా లీకైన ‏బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట్లో మారుమోగుతున్నాయి. 
 
అందులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, మానస్, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి ఇలా అనేక మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
అయితే, ఇందులో ‏బిగ్‏బాస్ షోకు నిజంగా వెళ్తున్నావారెవరో ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. అయితే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రోమో రిలీజ్ చేయ‌నుండ‌గా, ఆ ప్రోమోలో షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెబుతార‌ట‌. 
 
ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అంద‌రిని ఆగష్టు 22 నుండి క్వారెంటిన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేశారట. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత డైరెక్ట్‌గా హౌజ్‌లోకి పంపుతారని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

కడుపు నొప్పితో బాధపడిన మహిళ... పొట్టలో ఏకంగా రెండు కేజీల తలవెంట్రుకలు

హత్యకుగురైన పుంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం బాబు ఫోన్

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

స్వల్పశ్రేణి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments