గుట్టుచప్పుడు కాకుండా బిగ్ బాస్ షూటింగ్.. ఎక్కడ?

Webdunia
గురువారం, 20 మే 2021 (12:54 IST)
bigg boss
బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో సుదీప్ హోస్ట్‌గా ఉన్నారు. 
 
అయితే కరోనా వలన కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్ ఏర్పాటు చేసిన కారణంగా ఈ ఏడాది జరగాల్సిన బిగ్ బాస్ షో వాయిదా పడింది. అయితే మలయాళ బిగ్ బాస్ మూడో సీజన్ మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి నడుస్తుంది.
 
ఫిబ్రవరిలో మలయాళ బిగ్ బాస్ షో ప్రారంభం కాగా, ప్రస్తుతం ఈ కార్యక్రమం షూటింగ్ చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారట. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్‌ నిర్వహించడంతో తిరువళ్లూరు ఆర్డీవో ప్రీతి పర్కావి మంగళవారం పోలీసులతో అక్కడికి వెళ్లి షూటింగ్‌ను అడ్డుకున్నారు. 
 
సెట్‌ని సీల్ చేసి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు కెమెరామెన్లు, టెక్నీషియన్లు అందరిని పంపించేశారు. షూటింగ్‌లపై నిషేదం ఉన్నప్పటికీ ఇలా సీక్రెట్‌గా షూటింగ్ చేయడంపై నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరిగిన నిర్వాహకులు జూన్ 4న మలయాళ బిగ్ బాస్ ఫైనల్‌ను నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

మోహన్ బాబు యూనివర్సిటీలో సమర్థ 2025, 36-గంటల జాతీయ హ్యాకథాన్

Montha Cyclone: జగన్‌కి తుఫాను గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. రవి కుమార్

డీప్ ఫేక్‌లపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి... ఇక వారికి చుక్కలేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments