Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌పై సరయు సంచలన వ్యాఖ్యలు.. దమ్మున్న మగాడు...

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (17:09 IST)
ఈ నెల 5వ తేదీ నుంచి ప్రముఖ టీవీలో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అపుడే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే సరయు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. 
 
కానీ వంద రోజులు ఉండాల్సిన తాను వారానికే బయటకు రావడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. హౌస్‌లో కంటెస్టెంట్లు కొందరు ముసుగులు వేసుకుని సేఫ్‌ గేమ్‌ ఆడటం వల్ల తాను బయటకు వచ్చేశానని రగిలిపోయింది. 
 
ఈ క్రమంలో హౌస్‌లో ఉన్న ఒక్కో కంటెస్టెంటు బండారాన్నంతా బయటపెట్టింది. ముందుగా హౌస్‌లో కెప్టెన్‌గా కొనసాగుతున్న సిరి హన్మంత్‌ గురించి చెప్తూ ఆమె మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని విమర్శించింది.
 
యాంకర్‌ రవి.. మంచోడిలాగా నీతి సూత్రాలు బోధిస్తాడు, కానీ అతడి దగ్గర విషయమే లేదు అని పెదవి విరుస్తూ అతడి ఫొటోను విరగ్గొట్టింది. వీజే సన్నీకి అసలు క్యారెక్టరే లేదని తేల్చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో దమ్మున్న మగాడు ఎవరైనా ఉన్నారా? అంటే అతడు విశ్వ ఒక్కడే అని చెప్పింది. 
 
ఇక షణ్ముఖ్ జశ్వంత్‌ మీద మరోసారి విరుచుకుపడింది సరయూ. 'నిజంగా నీలో దమ్ము, ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే సింగిల్‌గా ఆడు.. లేదంటే గాజులేసుకుని మూలన కూర్చో.. అయినా నేను గాజులేసుకుని కూడా ఒక్కదాన్ని ఆడుతా, నువ్వు ఇంటికి వెళ్లి మూలన కూర్చో' అంటూ షణ్ముఖ్‌ను ఏకిపారేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments