Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు.. నా పెళ్లికి నన్ను పిలవండి

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (16:11 IST)
బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ ట్రెండింగ్‌లో వుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్‌ వచ్చాయి. దాని గురించి పెద్ద రచ్చ జరుగుతూ ఉండడంతో తాజాగా తన విడాకులపై సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేసింది.
 
అసలు ఈ చర్చ ఎలా మొదలైందో తెలియడం లేదని.. ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోను. కానీ మా పేరెంట్స్‌ కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతుల వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు ప్రచారం చేయకండి... అంటూ హిమజ స్పష్టం చేసింది.
 
అలాగే "నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి’ అంటూ వ్యంగంగా ఆమె పేర్కొంది. అయితే తనకు పెళ్లైంది అనే విషయాన్ని ఖండించిన ఆమె 3-4 ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికి చెప్పి చేసుకుంటానని తెలిపింది.
 
తాను షూటింగ్‌లో, త‌న‌ పనిలో బిజీగా ఉన్నాన‌ని హిమ‌జ చెప్పింది. త‌నకంటే ముందుగా త‌న మంచి గురించి ఆలోచించిన కొంద‌రు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కొందరు త‌న గురించి వ‌చ్చిన కొన్ని వార్త‌ల లింక్‌లు పంపారని చెప్పింది. తాను విడాకులు తీసుకుంటున్న‌ట్లు అందులో ఉంద‌ని తెలిపింది. కొంచ‌మ‌న్నా ఇంగిత జ్ఞానం లేదా?'.. అంటూ త‌నపై వ‌చ్చిన‌ 'పెళ్లి-విడాకుల' వార్త‌ల‌పై హిమజ ఫైర్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments