Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యక్తి చెప్పడం వల్లే బిగ్‌బాస్ షో చేస్తున్నా.. రెమ్యునరేషన్ అంతకాదులెండి : జూ.ఎన్టీఆర్

బిగ్ బాస్ షో చేయడానికి ఎవరు కారణమన్న విషయాన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారం కానున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ లాంఛింగ్ కార్యక్రమం శనివారం జ‌రిగింది. ఈ సంద

Webdunia
శనివారం, 8 జులై 2017 (15:10 IST)
బిగ్ బాస్ షో చేయడానికి ఎవరు కారణమన్న విషయాన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారం కానున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ లాంఛింగ్ కార్యక్రమం శనివారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన‌ను ఈ ‘బిగ్‌బాస్’ షో చేయ‌డానికి ఎవరు ఒప్పించారనే విష‌యాన్ని బహిర్గతం చేశారు.
 
మా టీవీలో ప‌నిచేసే ర‌ఘు అనే ఓ వ్య‌క్తి త‌న‌ను బిగ్‌బాస్‌కు హోస్ట్ చేయాలని అడిగార‌ని చెప్పారు. త‌న‌ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న రఘు వల్లే తాను ఈ షో చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని అన్నారు. రఘుకు తాను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు ఎన్టీఆర్ తెలిపారు. 
 
అంతేకాకుండా, బిగ్ బాస్ రియాలిటీ షోకు తనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలపై కూడా ఆయన స్పందించారు. తన భార్యాబిడ్డల్ని చూసుకునేంత డబ్బులు ఇప్పటికే తన వద్ద ఉందన్నారు. అయితే ఈ షో కోసం రెమ్యూనరేషన్ మాత్రం మీడియా చెబుతున్నంత ఎక్కువ ఇవ్వలేదని చెప్పారు. 
 
ఇంతవరకు రెమ్యూనరేషన్ గురించి ఏనాడూ పెద్దగా ఆలోచించలేదని, మీడియా ప్రతినిధులు అడుగుతుంటే ఈసారి రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోవాలని అనిపిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. బిగ్ బాస్ కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదని, అంతకంటే మంచి అనుభవమని, అందుకే సరికొత్త ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం, కళ్ల కింద నల్లని చారలు, విపరీతమైన ఒత్తిడి, ఓ ఉద్యోగిని సూసైడ్

YS Sharmila : జగన్ పార్టీకి బీజేపీతో అక్రమ సంబంధం వుంది: షర్మిల ఫైర్

తిరుపతి తొక్కిసలాట : క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments