Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేహా చౌదరికి బ్రియాన్‌ లారా సపోర్టా.. వామ్మో ఇది నిజమేనా?

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:25 IST)
Briyan Lara
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ విజయవంతంగా సక్సెస్ అవుతోంది. నామినేషన్స్‌ మొదలు.. కెప్టెన్సీ టాస్క్‌ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. మూడో వారంలో వాసంతీ కృష్ణన్‌, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి, ఇనయా సుల్తానా, శ్రీహాన్‌, రేవంత్‌, గీతూ రాయల్‌ నామినేషన్‌లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో నుంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారు.
 
ఎలాగైనా బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగాలనే పట్టుదలతో కసిగా గేమ్‌ ఆడుతున్నారు. తమ ఆట తీరుతో ఆడియన్స్‌ ఓట్లను సంపాదించుకునేందుకు బిగ్‌బాస్‌ హౌస్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. 
 
మరోవైపు తమకు నచ్చిన, తెలిసిన కంటెస్టెంట్స్‌కు ఓట్లు వేయాలని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వారి వారి సపోటర్స్‌. అయితే ఇదంతా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయింది. 
 
కానీ తాజాగా ఎలిమినేషన్‌ లిస్ట్‌లో ఉన్న నేహా చౌదరి కోసం మాత్రం ఏకంగా క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా రంగంలోకి దిగాడు. ఆమెకు ఓట్లు వేయాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. బ్రియన్‌ లారా లాంటి పెద్ద ఆటగాడు నేహా చౌదరికి సపోర్ట్‌ చేయడం ఏంటని అంతా షాకవుతున్నారు. 
 
వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందని నెటిజన్స్‌ చర్చిస్తున్నారు. ఇండియా క్రికెట్ మ్యాచులకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఒకరు. ఆ కారణంగానే లారాతో నేహకు పరిచయం ఏర్పడింది. అందుకే ఆమె కోసం లారా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టాడు. మరి లారా ప్రయత్నం ఫలించి నేహా హౌస్‌లో కొనసాగుతుందో లేదో ఆదివారం తెలిసిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments